అభివృద్ధిలో పోటీ పడుతున్న ఇద్దరు చంద్రులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, March 30, 2015

అభివృద్ధిలో పోటీ పడుతున్న ఇద్దరు చంద్రులు

ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులు ఇరువురు అభివృద్ధిలో పోటీ పడుతూ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. మార్చి 29నాడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖమ్మంలో పవర్ ప్లాంటు కు శంకుస్థాపన చేయగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అంతేగాకుండా ఏపీలో తిరుపతిలో మూడు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎస్ ఈసీ తదితర వాటికి శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో కేసీ ఆర్ మిషన్ కాకతీయ, అలాగే యాదగిరి గుట్టకు తిరుపతి వైభవం ఇలా ఒకరినొకరు పోటీలు పడీ అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. దీంతో ఇరు రాష్ర్టాల ప్రజలకు వీరి పాలన భరో సా కల్పిస్తోందని విశ్లేష్లకులు భావిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad