భక్తి శ్రద్ధలతో దసరా పండుగను జరుపుకున్న తెలుగు ప్రజలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 03, 2014

భక్తి శ్రద్ధలతో దసరా పండుగను జరుపుకున్న తెలుగు ప్రజలు

తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం అర్ధరాత్రి వరకు వైభవంగా జరిగాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో కళకళాడాయి. అంతేగాదు స్వయాన ఈ వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహన్ సాంప్రదాయ దుస్తులతో హాజరయ్యారు. టీఆర్ ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. వీరే కాకుండా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై పండుగను ఘనంగా నిర్వహించారు.
ఆధ్యాత్మికతకు మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో భక్తులు స్వామివార్లను దర్శించుకొని పునీతులయ్యారు. సుప్రీంకొర్టు చీఫ్ జస్టీస్ దత్తు స్వయాన తిరుమల శ్రీవారి పల్లకి సేవను మోసి శ్రీవారి సన్నిధిలో పునీతులయ్యారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వ్యాప్తంగా పలు జిల్లాలు, గ్రామాల్లో భక్తులు, ప్రజలు విజయధశమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నవరాత్రుల పూజలు మొదలు కొని చివరి రోజైన విజయదశమి రోజు పలు దేవాలయాల్లో భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. పలు కార్యాలయాలు, గృహాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad