రాజమౌళిని పొట్టోడు అని అంటున్నదెవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 20, 2014

రాజమౌళిని పొట్టోడు అని అంటున్నదెవరు?

rajamouli-trikoti
తెలుగులో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళిని పొట్టోడా అని పిలిచే సాహసం ఎవరైనా చేస్తారా?  అంటే అవును అని చెప్పాలి. అయితే ఇప్పుడు కాదులెండి ఒకప్పుటి మాట. ఇప్పుడు మాత్రం మౌళి గారూ అని గౌరవంగా పిలుస్తున్నాంట. ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా 'దిక్కులు చూడకు రామయ్య' ఆడియో వేడుకలో చెప్పారు.  ఆ చిత్ర దర్శకుడు త్రికోటి గురించి చెబుతూ ఆయన ఇలా అన్నారు..దర్శకుడు క్రాంతికుమార్ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడినని, అక్కడ కోటి తనకన్నా సీనియర్‌ అని చెప్పారు. అమీర్ పేటలోని శేష్ మహల్ థియేటర్ లో పాత సినిమాలకు ఇద్దరం వెళ్లేవాళ్లమని చెప్పారు. సినిమా చూసి తిరిగి  వస్తూ ఒరే పొట్టోడా ఆ సినిమాలో.... ఆ సీను... అనేవాడని... తాను హైట్ గా ఉన్నా పొట్టోడా అని ఎందుకు పిలుస్తున్నారని అడిగితే... పొట్టోడా అంటే చిన్నోడురా... అని కోటి చెప్పారట.

No comments:

Post a Comment

Post Bottom Ad