చైనా - భారత్ సంబంధాలు - 1 - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 24, 2014

చైనా - భారత్ సంబంధాలు - 1


india_china_war_20040823
చైనా అధ్యక్షుడు.. ఇటీవల భారత్ ను సందర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చైనా నుంచి ముగ్గురు అధ్యక్షులు మాత్రమే భారత్ లో పర్యటించారు. వారిలో ఒకరు.. ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్ పింగ్. ముందుగా చైనా - భారత్ సంబంధాలను పరిశీలిస్తే..
ప్రపంచంలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశాల్లో మూడో పెద్ద దేశం.. చైనా. జనాభాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ విషయానికొస్తే ప్రపంచంలో విస్తీర్ణంపరంగా ఏడో స్థానంలో నిలుస్తోంది. జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆసియా ఖండంలో విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా ఈ రెండు మాత్రమే పెద్ద దేశాలు.
చైనా.. మొదటి నుంచి భారత్ కు పక్కలో బల్లెంలా వ్యవహరిస్తోంది. మనదేశం కంటే రెండేళ్లు ఆలస్యంగా 1949లో స్వాత్రంత్ర్యం పొందిన చైనాకు మొదటి నుంచి భారత్ అండగా నిలబడింది. దాని సార్వభౌమాధికారాన్ని తొలిగా గుర్తించిన దేశాల్లో భారత్ ఒకటి. అప్పటి చైనా ప్రధాని చౌఎన్ లై.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే నినాదం ఇచ్చాడు. ఇరు దేశాల మధ్య 1954లో పంచశీల ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకూడదు. ఒకరి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించాలి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరుదేశాల ప్రయోజనాల కోసం ఒకరికొకరు సహకరించుకోవాలి అనేవి పంచశీల ఒప్పందంలోని అంశాలు. అయితే భారత్.. చైనాతో దాదాపు 3200 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇరుదేశాల మధ్య సరిహద్దు రేఖగా బ్రిటిష్ వారు నిర్ధారించిన మెక్ మోహన్ రేఖ ఉంది. అయితే దీన్ని అధికారిక సరిహద్దుగా చైనా ఎప్పుడూ గుర్తించలేదు. జమ్మూ కాశ్మీర్ లోని ఆక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి వాటిని తన భూభాగాలేననేది చైనా వాదన. అంతేకాకుండా 1959లో ప్రత్యేక టిబెట్ కోసం ఉద్యమిస్తున్న బౌద్ధమత గురువు దలైలామాను భారత్ ఎగదోస్తుందని చైనా నమ్మింది. ప్రాణభయంతో భారత్ కు పారిపోయి వచ్చిన దలైలామాకు భారత్ ఆశ్రయమిచ్చింది. ఇలా వివిధ కారణాలతో చైనా సైన్యం 1962 అక్టోబర్ 20 హిమాలయాల్లోని సరిహద్దును దాటి 1000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చింది. మరోవైపు ఇటు ఈశాన్య ప్రాంతంలోనూ చైనా సైన్యం భారత్ పై దాడికి దిగింది. 30,000 మందికి పైగా చైనా సైన్యం అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడితే.. మనవద్ద సమాధానం లేకపోయింది. స్వల్ప సంఖ్యలో ఉన్న భారత సైనికులు..వారిని ఎదుర్కోలేక పోయారు. వేలాది మంది విగతజీవులుగా మారారు. ఎంతోమంది గాయపడ్డారు. మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ విషయంలో చైనాను గుడ్డిగా నమ్మిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తగిన మూల్యం చెల్లించాడు. నాటి రక్షణమంత్రి కృష్ణమీనన్ అసమర్థ నిర్వాహకం, నెహ్రూ పనికిమాలిన విదేశాంగ విధానం భారత్ ను ఘోర పరాజయం పాలు చేశాయి. మొదటి నుంచీ చైనాను అతిగా నమ్మవద్దని.. సరిహద్దుల్లో భారత సైన్యాన్ని పెంచాలని చెవినిల్లుకట్టుకుని పోరాడిన దివంగత ప్రియతమ నేత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట పెడచెవిన పెట్టారు. దాదాపు నెల రోజులు ఈ యుద్దం జరిగింది. భారత్ లో ఎన్నో ప్రాంతాలను చైనా ఆక్రమించింది. ఈ సంఘటన నెహ్రూను చాలా బాధించింది. ఆయన మరణానికి దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటని విశ్లేషకులు అంటుంటారు. అయితే భారత్ చైనాకు వ్యతిరేకం కాదు. భారత్ ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించింది లేదు. ఆ మాటకొస్తే ఐక్యరాజ్యసమితి అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతామండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం విషయంలో లాబీయింగ్ చేసింది మనదేశమే. కానీ ఆసియా ఖండంలో తానే నెంబర్ వన్ గా ఉండాలనే చైనా దుందుడుకు వైఖరి, భారత్ ఎదుగుదలను సహించలేకపోవడం, ప్రపంచ రాజకీయాల్లో భారత్ క్రియాశీలక పాత్ర పోషించడం దానికి నచ్చడం లేదు. తనతోపాటే భారత్ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటం చూసి కుళ్లుకుంటోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad