ఫేస్ బుక్ లో కి'లేడి' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 25, 2014

ఫేస్ బుక్ లో కి'లేడి'

facebook-danger-lady
రాన్రాను అమ్మాయిలు కూడానేర జీవితానికి అలవాటు పడిపోతున్నారు. నేరాలు చేయడంలో మగవాళ్లతో పోటీపడుతున్నారు. గోవాలో ఓ అమ్మాయి చేసిన పని చూస్తే అందులో ఏమాత్రం సందేహం లేదనిపించకమానదు. స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు తెరిచి, వాళ్ల ఫొటోలతో అసభ్య రాతలు రాయడం, అశ్లీలమైన పోస్టులు పెట్టడం వంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తున్న ఓ 22 ఏళ్ల యువతిని గోవా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది స్నేహితుల పేర్ల మీద ఫేక్ ఫేస్ బుక్ ఐడీలను క్రియేట్ వారిని వేధించసాగింది. తెలివిగా ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి ఈ అకౌంట్లను క్రియేట్ చేయడంతో ఆమెని పట్టుకోవడం పోలీసులకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. చివరకు ఎలాగోలా ఈ కేసుని ఛేదించి ఆమెని అదుపులోకి తీసుకోగలిగారు. ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారు జామునే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, అదే సమయంలో ఆయా ఐడీలతో అశ్లీలమైన పోస్టింగులు చేయడం ఈ యువతి పనిగా పెట్టుకుందని పోలీసులు తెలిపారు. అబ్బాయిలూ.. వీరితో జాగ్రత్త

No comments:

Post a Comment

Post Bottom Ad