అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, June 20, 2014

అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం


హైదరాబాద్: వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక రం గాల డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు జూలై 10 లోగా దరఖాస్తులు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014 ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన బైపీసీ విభాగం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఎంసెట్ ర్యాంక్‌తో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ విభాగాల్లో ఉత్తీర్ణులైన బాలికలు బీఎస్సీ(ఆనర్స్) హోంసైన్స్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.angrau.ac.inను చూడవచ్చు.

No comments:

Post a Comment

Post Bottom Ad